Home Page SliderNational

భూవివాదంలో నోబుల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్

విశ్వభారతి యూనివర్శిటీ, నోబుల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ భూవివాదం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. విశ్వభారతికి చెందిన భూమిని సేన్, తన ఆధీనంలో ఉంచుకున్నాడంటూ గతంలోనే నోటీసు జారీ చేయడంతో వివాదం రాజుకొంది. అయితే ఆ భూమి అమర్త్యసేన్‌దేనంటూ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా తేల్చి చెప్పారు. అయితే తాజాగా విశ్వభారతి యూనివర్శిటీ, అమర్త్యసేన్‌కు మరో నోటీస్ జారీ చేసింది. అనధికారికంగా ఆక్రమించుకున్న 13 డెసిమెల్స్ భూమిని (ఎకరానికి పైగా) మే 6లోగా, లేదంటే ఏప్రిల్ 19న చివరి ఉత్తర్వులో పేర్కొన్నట్టుగా ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్శిటీ నోటీసులో పేర్కొంది. కేంద్ర సంస్థల భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని నోటీసులో వివరించింది.

అమర్త్య కుమార్ సేన్‌తో సహా, భూములను ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తులందరూ స్థలాన్ని ఖాళీ చేయాలని, అవసరమైతే, బలప్రయోగం చేసైనా సరే… స్వాధీనం చేసుకుంటామంటూ నోటీసులో యూనివర్శిటీ పేర్కొంది. షెడ్యూల్ చేసిన ప్రాంగణంలో వాయువ్య మూలలో 50 అడుగుల x 111 అడుగుల పరిమాణం కలిగిన ఎకరానికి పైగా భూమిని రికవరీ చేయాలని నిర్ణయించినట్టు నోటీసులో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంగణంలో 1.25 ఎకరాల భూమిని మాత్రమే సేన్ కుటుంబం లీజుగా పొందిందని నోటీసులో వివరించింది. షెడ్యూల్డ్ ప్రాంగణంలో 1.38 ఎకరాల భూమిని తన ఆధీనంలో ఉంచుకునేందుకు ఎలాంటి అధికారం లేదని రిజిస్ట్రార్ ఆశిష్ మహతో నోటీసులో స్పష్టం చేశారు. శాంతినికేతన్‌లో నోబెల్ బహుమతి గ్రహీత ఉన్న సమయంలో, సేన్ పూర్వీకుల ఇల్లు ‘ప్రతిచి’లో నివసించే అమర్త్యసేన్‌కు కొన్ని రోజుల క్రితం సెంట్రల్ యూనివర్శిటీ నోటీసులు జారీ చేసింది.

అంతకుముందు షోకాజ్‌కు అమర్త్యసేన్ ఇచ్చిన సమాధానం ఇచ్చారు. తాను భూమి ఆక్రమించుకున్నానని చెప్పడం శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు. 1.25 ఎకరాల భూమిని విశ్వభారతి తన తండ్రికి లీజుకు ఇచ్చినప్పుడు… పక్కనే ఉన్న 1.38 ఎకరాల భూమిని తన తండ్రి కొనుగోలు చేశారని, దానిని నిరూపించడానికి అవసరమైన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని అమర్త్యసేన్ పదేపదే వివరిస్తూ వస్తున్నారు.