Andhra PradeshNews Alert

అమరావతి మహాపాదయాత్ర 2.0 నేడే శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములిస్తే.. మూడు రాజధానులంటూ వంచిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత మూడేళ్లుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అమరావతి అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని రైతులు గత కొంతకాలంగా వాదిస్తూఉన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా రాజధానుల వికేంద్రీకరణ కాకుండా… అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అమరావతి రైతులు మహాపాదయాత్ర 2.0 యాత్రకు శ్రీకారం చుట్టారు. రెండో విడత పాదయాత్ర రాజధానిలోని 29 గ్రామాల నుంచి నిర్వహిస్తారు. మహాపాదయాత్ర నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవిల్లికి చేరనుంది. అరసవిల్లిలోని సూర్యభగవానుడి ఆలయం ఆకృతిలో రథాన్ని తీర్చిదిద్దారు. శ్రీదేవి, భూదేవి సమేత, శ్రీనివాసుడి విగ్రహాలను ఉంచారు.