Andhra PradeshHome Page Slider

రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు-పవన్ కల్యాణ్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన పార్టీ పొత్తుకు ప్రాధాన్యమిస్తోందని, విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పొత్తు దిశగా జనసేన ముందుకెళ్తోందన్నారు జనసేనాని పవన్ కల్యాణ్… ఇలాంటి సమయంలో ఎవరైనా భావోద్వేగానికి లైనో వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు పవన్ కల్యాణ్. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. పొత్తులకు సంబంధించి డౌట్స్ ఉన్నవారు తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. పొత్తుకు విఘాతం కలిగించేవారిని ప్రజలు గమనిస్తారన్నారు పవన్ కల్యాణ్.