అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు…!మైనర్‌తో లైంగిక సంబంధం రేప్ కాదు?
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక నూతన తీర్పు దేశంలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ తీర్పు 2021లో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసును విచారించడంలో వెలువడింది. కోర్టు, నిందితులు బాలికపై అత్యాచార యత్నం చేసినట్లు మంజూరు చేయడం లేదు. నిందితులు బాలికను లిఫ్ట్ ఇచ్చే భంగిమలో ఆమెను అత్యాచారానికి యత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి, కానీ కోర్టు ఈ చర్యను రేప్ అటెంప్ట్‌గా పరిగణించలేదు. ఈ కేసులో, నిందితులు పవన్, ఆకాష్ అనే వ్యక్తులు మైనర్ బాలికతో లైంగికంగా అనుచితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు బాలికను బలవంతంగా కల్వర్ట్ కింద లాగడానికి ప్రయత్నించారు. అయితే, వారు ఆమెను వివస్త్రం చేయలేదని, మరియు దీనిని రేప్ అటెంప్ట్‌గా పరిగణించలేమని కోర్టు చెప్పింది. కోర్టు, ఈ చర్యను “అత్యాచార యత్నం” కింద తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు మహిళా న్యాయవాదులు. బాలిక ఛాతీని పట్టుకోవడం లైంగికదాడి కాదా? పైజామా ఊడిపోయేలా నాడాలు తీయడం రేప్ అటెంప్ట్ కాదా? అంటూ వాళ్లు కొశ్చన్ చేస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవేవి రేప్ అటెంప్ట్ కిందకు రావంటోంది కోర్టు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై మొదలైన చర్చ, ఎటు దారితీస్తుందో.

