మంత్రి మల్లారెడ్డి పదవుల కబ్జా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల విమర్శలు
జిల్లా పదవులన్నీ… మేడ్చల్ నియోజకవర్గం నేతలకే కట్టబెట్టడంతో మిగిలిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు.. ఒక నియోజవకర్గానికే పదవులన్నీ పోతున్నాయని, జిల్లా పదవులన్నీ మంత్రి మల్లారెడ్డి ఒక్కరే తీసుకెళ్తున్నారని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యేలకు మంత్రి మల్లారెడ్డి గౌరవం ఇవ్వడం లేదని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. అందరితో మాట్లాడాలని సీఎం చెప్పిన మంత్రి మల్లారెడ్డి పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. కార్యకర్తల ఆవేదన తెలిపేందుకే తామందరం సమావేశమయ్యామని మైనంపల్లి తెలిపారు. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని సైతం.. మల్లారెడ్డి అనుచరులకే కట్టబెట్టారని దుయ్యబట్టారు ఎమ్మెల్యే వివేక్. తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు… వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.