నా డబ్బంతా వైటే
హైద్రాబాద్‌లోని జూబిలీహిల్స్ ఏరియాలో ఉన్న ప్రముఖ సినీ తారలు,డైరెక్టర్లు,నిర్మాతల ఇళ్లపై గత రెండు రోజుల నుంచి నిరవధికంగా సాగుతున్న ఐటి దాడులపై డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటిసారిగా మీడియా ముందు గొంతు విప్పారు.తన ఇంట్లో ఐటి దాడులనేవి జరగలేదని స్పష్టం చేశారు. ప్రతీ రెండేళ్లకొకసారి ఐటి అధికారులు తనిఖీలకు రావడం సర్వసాధారణమన్నారు.అదేవిధంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ తన ఇంటి వద్దకు ఏ అధికారి రాలేదన్నారు.తాను తీసుకునే పారితోషికం అంతా వైటే అని తెలిపారు.అలాంటప్పుడు తాను భయపడాల్సిన అవసరం లేదన్నారు. సిని ప్రముఖుల ఇళ్లల్లో దాడులు సర్వసాధరణమని వెల్లడించారు.