అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి బాజాలు
అక్కినేని నాగార్జున ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి. ఇటీవలే నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే తన చిన్నకుమారుడు అఖిల్‌కు, ఆర్టిస్ట్ జైనబ్ రావ్‌జీతో నిశ్చితార్థం జరిగిన సంగతి వెల్లడించారు. వీరి పెళ్లిడేట్‌కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అఖిల్ వివాహం ఈ ఏడాది మార్చి 24న జరగబోతున్నట్లు సమాచారం. తన అన్న చైతూ బాటలోనే అఖిల్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేవు.

