ఫడ్నవిస్ సీఎంగా అజిత్ మద్దతు
మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా జరిగిన అంసెబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు కు అలైన్స్ నేతలు మంతనాలు చేస్తున్నారు. అయితే సీఎం సీటు ఎవరికి దక్కుతుందోనని ఆసక్తి నెలకొంది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ కు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయనతో ఎన్సీపీ ఎమ్మెల్యేందరూ తీర్మానం చేశారని తెలుస్తోంది.

