Home Page SliderInternational

‘కేన్స్‌’లో వెండి వెన్నెలలా మెరిసిన ఐశ్వర్యరాయ్

ఈ సారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వెండిగౌనులో చందమామలా మెరిసిపోయింది ఐశ్వర్యరాయ్. ఫ్యాషన్ ప్రపంచానికి వేదికగా నిలిచిన కేన్స్ ఫిల్మ ఫెస్టివల్ ప్రతీ సంవత్సరం కొత్తగా ఉంటుంది. ప్రపంచదేశాల నుండి సెలబ్రిటీలు, హీరోయిన్ ఫ్యాషన్ దుస్తులతో సందడి చేస్తూ ఉంటారు. కేన్స్‌లో ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ ప్రత్యేకమే. కేన్స్ వేదికపై ఐశ్వర్య ఉందంటే అందరూ కళ్లప్పగించి చూస్తూండిపోతారు. అయితే ఈసారి ఆమె వెండి గౌను, వెండి హుడి ధరించిన నల్ల గౌనులో వచ్చింది. కొందరు అభిమానులు ఆమెను ఫ్యాషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారని మెచ్చుకుంటుంటే, మరి కొందరు ఇదేం డ్రెస్, డిజైనర్‌ను మార్చండంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా విశ్వసుందరికి ఏ డ్రెస్ అయినా అందమే అంటున్నారు కొందరు వీరాభిమానులు.