నేడు నగరానికి వస్తున్న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ
భువనగిరికి సోమవారం (నేడు) ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉ.11.30 గంటలకు ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆమె మాట్లాడతారు. పట్టణ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద ప్రియాంకకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. ఎల్లమ్మ గుడి నుంచి పట్టణ ప్రధాన రహదారి గుండా రోడ్ షోను నిర్వహించనున్నారు. ప్రియాంకగాంధీ రాకను పురస్కరించుకుని ఆదివారం పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, కీర్తిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

