Home Page SliderNationalNews

యువతకు ఏఐ ఛాలెంజ్ కాంపిటిషన్ :రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్

ఇంటర్నెట్ డెస్క్ : అన్ని రంగాలలో ఏఐ పరిజ్ఞానం విస్తరిస్తోంది. భారతీయ యువతరం కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం సరికొత్త పోటీతో ముందుకు వచ్చింది. యువ ఏఐ గ్లోబల్ యువత ఛాలెంజ్ పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులను ఆహ్వానిస్తోంది. వారికి మెరుగైన అవకాశాలు కల్పించడానికి ఈ పోటీ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నిత్య జీవితంలో పలు సమస్యలకు ఏఐ పరిష్కారాలు కనిపెట్టాలంటూ సవాల్ విసురుతోంది. ఆసక్తి ఉన్న13 నుండి 21 ఏళ్ల వయసు యువత నవంబర్ 30 రాత్రి లోగా అధికారిక వెబ్ సైట్ http//impact.indiaai.gov.in/events/yuvai ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 8 వ తరగతి నుండి బీటెక్ విద్యార్థుల వరకూ టీమ్ గా దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడు టీమ్స్ కు రూ.15 లక్షలు, రెండవ స్థానంలో మూడు బృందాలకు రూ.10 లక్షలు, ప్రత్యేక బహుమతి పేరుతో మూడవ స్థానంలోని రెండు బృందాలకు రూ.5 లక్షల చొప్పున క్యాష్ ప్రైజ్ అందిస్తున్నారు.
వీరు పలు రంగాలకు సంబంధించి ఏఐ ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది.
. ప్రజలను సంఘటితం చేయడం
. మౌలిక సదుపాయాలు
. స్మార్ట్ పర్యావరణ వ్యవస్థలు
. ఓపెన్ ఇన్నోవేషన్
వంటి ఎలాంటి రంగంలోనైనా, లేదా ఆసక్తి ఉన్న ఉపయోగం ఉండే మరేదైనా ఏఐ పరిష్కారాలు చెప్పే ప్రాజెక్టును చేయవచ్చు.