News

సమ్మక్క, సారలమ్మ జాతరకు 75 కోట్లు-మంత్రి పొంగులేటి

Share with

సమ్మక, సారలమ్మ మహా జాతర 2024 ఏర్పాట్లు, నిర్వహణ గురించి ఈరోజు MCRHRD లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మరియు కొండ సురేఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి సమీక్షించారు. ఈసారి జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కోసం మంజూరు చేసిందని, పనులు అన్నీ జనవరి 31 లోగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని వెళ్లో లోగా ఏర్పాటు చేయాలని, ఉచిత బస్ సౌకర్యం వల్ల బస్ ప్రయాణంలో వచ్చే మహిళ భక్తజనం పెరిగే అవకాశం ఉందని, ఎన్ని ఏర్పాట్లు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.