అధికారంలోకి వచ్చాక ఇండియాకు తగిన బహుమానం ఇస్తా
పిచ్చోడి చేతిలో రాయి అని అమెరికా మాజీ అధ్యక్షుడి గురించి మనం మాట్లాడుకునేవారం. ఇప్పుడు మరోసారి ఆయన అదే లైన్లో ముందుకు సాగుతున్నాడు. కాకుంటే ఎన్నికల్లో గెలిచేందుకు అమెరికన్లను మరింత చీట్ చేసేలా మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నాడు. పలు దేశాలకు అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై పన్నులు భారీగా వడ్డిస్తున్నారంటూ ట్రంప్ ఆరోపించాడు. అధికారంలోకి వస్తే ఇండియా పన్నుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలతో పోల్చుకుంటే భారతదేశం విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తోందని ఆరోపించాడు. అలాగే చైనా 200 శాతం, బ్రెజిల్తోపాటుగా ఇండియా ఎక్కువ పన్నులు విధిస్తోందన్నాడు.