crimeHome Page SliderNational

ఆదానిని ఆరెస్ట్ చేయాల్సిందే – రాహుల్ గాంధీ

అత్యంత అవినీతి ప‌రుడైన అంత‌ర్జాతీయ ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఆదానిని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీలో విలేక‌రుల‌తో మాట్లాడారు. సోలార్ ప్రాజెక్ట్ అనుమ‌తి కోసం అమెరికాకు చెందిన కాంట్రాక్ట‌ర్ల‌కు రూ.2వేల కోట్ల డాల‌ర్ల‌కు పైగా లంచం ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌ల మేర‌కు న్యూయార్క్‌లోని ఫెడ‌ర‌ల్ కోర్టు ఆదాని అరెస్ట్ కు వారెంట్ ఇష్యూ చేసింది.ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌ని నిత్యం రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు.కాగా బుధ‌వారం కూడా రాహుల్ త‌న వాణిని ని ఇదే ర‌కంగా వినిపించారు.ఆదానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరారు.అదేవిధంగా ఉభ‌య స‌భ‌ల్లోనూ ఆదాని వ్య‌వహారాన్ని చ‌ర్చ‌కు అనుమతించాల‌ని కోరుతూ ఇండియా ప‌క్షాలు సైతం ప‌ట్టుబ‌డుతున్నాయి.