Home Page SliderInternational

టాప్ 10 నుండి అదానీ, అంబానీ ఔట్

ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ కుబేరులు అంబానీ, అదానీలు ఔటయ్యారు. భారత స్టాక్ మార్కెట్ గత రెండు రోజులుగా భారీగా పతనమవడమే దీనికి కారణం. ఈ క్షీణత వల్ల వీరి ఆస్తులు గణనీయంగా తగ్గాయి. అందుకే టాప్ 10 జాబితా నుండి వీళ్లిద్దరి పేర్లు తొలగిపోయాయి. అయితే అత్యంత వేగంగా ఈ జాబితాలో రెండవస్థానం సాధించిన ఘనత ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్‌దే. కేవలం 20 ఏళ్లలోనే ఈ స్థానం సంపాదించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి, ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్  రెండవస్థానం సాధించారు.

మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ 256 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మార్క్ జుకర్ బర్గ్ 206.2 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. మూడవ స్థానంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 205.1 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు.