మదనపల్లెలో యాసిడ్ దాడి.. హోంమంత్రి ఆగ్రహం
మదనపల్లెకు చెందిన గణేష్ అనే వ్యక్తి గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించపోవడంతో ఆమె తలపై కత్తితో పొడిచి, ముఖంపై యాసిడ్ దాడి చేశాడు. ఏప్రిల్ 29న ఆమెకు మరొక వ్యక్తితో వివాహం జరగనున్నట్లు సమాచారం. బాధితురాలిని తొలుత మదనపల్లె ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. యువతి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి, ఆమెను మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించరాదని పోలీసులకు హోం మంత్రి ఆదేశించారు.