Home Page SliderTelangana

టీజీఆర్టీసీలో డ్రైవర్‌గా మహిళ

దేశంలోనే తొలి మహిళా డ్రైవర్‌గా పేరు పొందిన తెలంగాణ అమ్మాయి సరిత తనకు టీజీఆర్టీసీలో ఉద్యోగం ఇప్పించమంటూ కోరుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంట్రాక్టు పద్దతిలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా దేశంలో మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా అవార్డు తీసుకున్నారు సరిత. ఆమె తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వారికి ఆసరాగా ఉండేందుకు తెలంగాణలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పించమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం చేసుకుంటున్నారు. తమకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమెకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనూ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తోనూ మాట్లాడి ఆమెకు త్వరలోనే ఆర్టీసీలో డ్రైవర్‌గా అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని పేర్కొన్నారు. దీనితో ఆమె తెలంగాణకు మొదటి మహిళా బస్సు డ్రైవర్‌గా మారనున్నారు.