సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నంలో ట్విస్ట్..
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం సినీ ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది. నిన్న ఆమె అధిక సంఖ్యలో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కల్పన కుమార్తె కేరళ నుండి వచ్చి పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం తన తల్లి ఆత్మహత్య చేసుకోలేదని, కేవలం నిద్రమాత్రల డోస్ ఎక్కువయ్యిందని, డాక్టర్లు సూచించిన మందులే మానసిక ప్రశాంతత కోసం వాడుతోందని పేర్కొంది.
అయితే తనను చదువుకోవడానికి హైదరాబాద్ రమ్మని తల్లి కోరుతోందని, కానీ తాను కేరళలోనే ఉంటానని చెప్పింది. కల్పన భర్త ఫోన్ చేయడంతో పోలీసులు ఇంటి తలుపు బద్దలు కొట్టి ఆమెను రక్షించి, ఆసుపత్రిలో చేర్చారు. తొలుత ఆమెకు స్టమక్ క్లీన్ చేశారు డాక్టర్లు. తర్వాత బ్రీతింగ్ కష్టమవడంతో వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందించారు. దీనితో ఆమె కాస్త కోలుకుందని, ప్రాణాపాయం లేదని వెల్లడించారు. అయితే మొదట ఆమె భర్తను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వెంటబెట్టుకుని ఇంట్లో సోదాలు ప్రారంభించారు. తర్వాత కుమార్తెతో విభేదాల వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని భావించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సింగర్స్ ఆమెను పరామర్శించడానికి ఆసుపత్రికి చేరుకున్నారు.