crimeHome Page SliderNationalNews AlertPolitics

ప్రధానిని చంపేస్తాం.. బెదిరింపు ఫోన్‌కాల్

భారత ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరిస్తూ ఒక మహిళ నుండి ఫోన్ కాల్ వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ కాల్‌ ముంబయిలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వచ్చినట్లు తెలిపారు. దీనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. 34 ఏళ్ల మహిళ ఈ ఫోన్ చేసిందని ప్రధాని మోదీని హత్య చేస్తానని, ఒక ఆయుధం కూడా రెడీగా ఉందని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు మతి స్థిమితం లేనట్లు కూడా కనిపెట్టారు.