రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థి
ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఫోన్ కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్ధి.హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ.. ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తుండగా కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి ఫోన్ కిందజారిపడింది.దీంతో కంగారులో ఫోన్ పోయిందన్న బాధతో రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి దూకేశాడు.ట్రైన్ ఎంత స్పీడులో వెళ్తుందో అనే కనీస స్పృహలేకుండా దూకేశాడు.దీంతో విద్యార్ధికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు.