ఎడారిలోఅరుదైన చేపలవర్షం
వాననీటికై తహతహలాడే ఎడారిప్రాంతంలో అద్భుతదృశ్యం గోచరించింది. ఏకంగా చేపల వర్షం కురిసింది. ఆస్ట్రేలియాలోని టనామీ ఎడారిలో ఈ వర్షం పడింది. అక్కడ లాజమాను అనే పట్టణంలో భారీవర్షంతో పాటు చేపలు గంపలకొద్దీ వర్షాలతో కూడి పడ్డాయి. ఉరుములు,మెరుపులతో వర్షం మొదలవ్వగా, అక్కడి ప్రజలు వర్షం మాత్రమే పడుతోందని భావించగా, భారీ స్థాయిలో ఆకాశం నుండి చేపలు పడుతూ స్థానికులను అబ్బురపరిచాయి. ఇదంతా భగవంతుని ఆశీర్వాద ఫలితమేనని మురిసిపోయారు. ఈ వర్షంతో పాటు పడిన చేపలు బతికే ఉన్నాయని లాజమాను పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక వాతావరణ నిపుణులు సుడిగుండాలు, టోర్నడోలు కారణంగా నీటితో చేపలను తీసుకెళ్లి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో పడేస్తాయని వివరణ ఇస్తున్నారు.

