కడిగిన ముత్యంలా కస్టడీ నుండి బయటకొస్తా అన్న కవిత
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు. ఈడీ తనపై పెట్టింది మనీలాండరింగ్ కేసు కాదని.. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని కవిత అన్నారు. ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నేను తప్పు చేయలేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. తాత్కాలికంగా నన్ను జైల్లో పెడతారేమో.. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు.