విద్యార్థుల కోసం వాగు దాటిన మంత్రి
విద్యార్థుల కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వాగు దాటారు. బుధవారం ఆమె కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి వెళ్లారు. అయితే వాగు అడ్డంగా ఉండడం.. బ్రిడ్జి పనులు పూర్తికాక పోవడంతో మంత్రి నడుచుకుంటూ వాగు దాటారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్తులకు సీతక్క హామీ ఇచ్చారు. మంత్రి వాగు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

