‘మొండెం లేని తల’ గుట్టు రట్టయ్యింది
హైదరాబాద్ మూసీ నదిలో వారం క్రితం దొరికిన మహిళ తల గుట్టు విడిపోయింది. తలను వేరుచేసి మొండాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆతల ఎవరిదో కనిపెట్టారు పోలీసులు. 8 బృందాలు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. తలను పోస్టర్లు వేసి, వైరల్ చేయడంతో సోదరి గుర్తుపట్టారు. తల భాగం మూసీనదిలో మూసారాం బాగ్‌లో దొరికింది. చైతన్యపురిలోని ఆమె ఉంటున్న ఇంటి ఓనరే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. మృతురాలిని ఎర్రం అనూరాధగా గుర్తించారు. ఆమె కేర్ హాస్పటల్‌లో నర్సుగా పనిచేస్తోందని కనిపెట్టారు.

ఆమె తల దొరకడంతో దానిని గుర్తుపట్టిన ఆమె సోదరి ఆమెను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె వడ్డీ వ్యాపారం కూడా చేస్తోందని, ఓనర్ చంద్రమౌళికి 18 లక్షలు అప్పుగా ఇచ్చి, దానిని రాబట్టుకునే క్రమంలో హత్యకు గురైనట్లు తెలిసింది. అప్పు తిరిగి ఇవ్వమని అడగడంతో అతడే ఎవరూ లేని సమయంలో హత్యకు పాల్పడ్డాడని, ఆసంగతి ఎవరికీ తెలియకుండా తల నరికి మూసీ నదిలో విసిరేసాడని తెలిసింది. మిగతా శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. హంతకుడు చంద్రమౌళిని అరెస్టు చేసి, సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు.