ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యకు ప్రయత్నించిన తండ్రి
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చెరువులో కారుతో సహా, తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడో తండ్రి. హైదరాబాద్‌లో బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన అశోక్ కాంట్రాక్టరుగా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం తన ముగ్గురు పిల్లలను కారులో తీసుకుని వేగంగా చెరువు వైపుగా కారును నడపడం చూసిన స్థానికులు సందేహించారు. అక్కడ ఉండే ఇనాంగూడ చెరువులోకి కారు దూసుకెళుతుండడంతో వారికి అనుమానం వచ్చి, వెంటనే స్పందించారు. తాళ్లు, రబ్బర్ టైర్ల సహాయంతో కారులోని పిల్లలను, తండ్రిని కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆర్థిక సమస్యలు, భార్యతో విభేదాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

