కేటిఆర్‌పై ఎట్టకేలకు కేసు నమోదు
దమ్ముంటే అరెస్ట్ చెయ్ అంటూ గత రెండు నెలల నుంచి గగ్గోలు పెట్టిన మాజీ మంత్రి కేటిఆర్ కోరికను తెలంగాణ ఏసిబి ఎట్టకేలకు తీర్చింది.అసెంబ్లీ సమావేశాలు ఓ వైపు జరుగుతుండగానే మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో … కేటిఆర్‌పై ఫార్ములా-ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసింది.పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది.ఓ ఆర్ ఆర్ టెండర్ విచారణకు సిట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చారు.అయితే టెండర్ రద్దు చేసి సిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏ1 కేటిఆర్‌ని ,ఏ2గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్,ఏ3గా హెచ్.ఎం.డి.ఏ మాజీ చీఫ్ ఇంజినీర్ జి.ఎల్.ఎన్.రెడ్డిని చేరుస్తూ కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కేటిఆర్ పై అన్యాయంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

