“ఇది రైతుల తలరాతలు మార్చే బడ్జెట్” – భట్టి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. దీనిలో కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చినట్లుగానే సింహభాగం వ్యవసాయానికి కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఇది రైతుల తలరాతలు మార్చే బడ్జెట్’ అని పేర్కొన్నారు. వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ రైతులకు అవసరమైన సాయం అందిస్తామని, ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. మరో 23,131 ఎకరాలకు అనుమతులు ఇచ్చామని తెలియజేశారు.