Home Page SliderTelangana

పెళ్లికీ ఒక్కరోజు ముందు పెళ్ళికొడుకు సూసైడ్..

జగిత్యాల జిల్లాలో విషాదం జరిగింది. మెట్ పల్లి మండలం రామచంద్రంపేటలో పెళ్లికి ఒక్కరోజు ముందు పెళ్ళికొడుకు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.. నిన్న ఫోటో షూట్ ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొన్న యువకుడు ఇవాళ తెల్లవారు జామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో పెండ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఇంట్లో అందరికంటే యాక్టివ్ గా ఉండేవాడని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం ‌కావడం లేదని బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.