Home Page SlidermoviesNational

సల్మాన్‌తో డ్యాన్స్ అదరగొట్టిన రష్మిక.. రంజాన్‌కు విడుదల

పుష్ప, యానిమల్, ఛావా లాంటి పాన్‌ ఇండియా చిత్రాలతో బాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక, తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్‌తో జోడీ కట్టారు. ఏ ఆర్ మురుగదాస్ డైరక్షన్‌లో తెరకెక్కిన సికందర్ మూవీలో సల్మాన్, రష్మికలు జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని మార్చి 28న రంజాన్ కానుకగా విడుదల చేస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదలైన ఈ చిత్రంలోని జోహ్ర జబీన్ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో రష్మిక ఆటపాటలతో ప్రేక్షకులను  అదరగొట్టిందని అభిమానులు సంబరపడుతున్నారు.