Home Page SliderTelangana

పోలీసు వాహనం బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..

సంగారెడ్డి – పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం పటాన్ చెఱు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.