చికెన్ తినొద్దని తెలంగాణ సర్కార్ వార్నింగ్
చికెన్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చిరించింది. కొన్ని రోజుల పాటు చికెన్ తినవద్దని రాష్ర్ట పశు సంవర్ధక శాఖ కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ఎత్తున కోళ్లు వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే.. వైరస్ సోకి తెలంగాణతో పాటు ఏపీలోనూ లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పొరుగు రాష్ట్రలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కూడా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లకు హై పాథోజెనిక్ ఏవియన్ ఇన్ ఫ్లూయెంజాతో కోళ్లు మరణిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది.

