Home Page SliderInternational

శ్రీలంక నేవీ దూకుడు…గాయాలపాలైన భారతీయులు

శ్రీలంక నావికాదళం భారత మత్స్యకారులపై దూకుడుగా ప్రవర్తించింది. శ్రీలంక నావికాదళం జాఫ్నా సముద్రంలో కాల్పులు జరపడంతో కారైకాల్‌కు చెందిన ఇద్దరు భారతీయ మత్స్యకారులు గాయపడ్డారు. జాఫ్నాలోని పరుత్తుర బీచ్ సమీపంలో చేపలు పట్టేందుకు రెండు పడవల్లో వెళ్లిన 13 మంది సభ్యుల బృందంలో మత్స్యకారులు ఉన్నారని రామేశ్వరం ఫిషర్మాన్ అసోసియేషన్ (RFA) తెలియజేసింది. వారు జరిపిన కాల్పులలో భారత మత్స్యకారులకు తీవ్ర గాయాలకు గురయ్యారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ కాల్పుల ఘటనపై భారత్‌లోని శ్రీలంక తాత్కాలిక రాయబారికి విదేశాంగ శాఖ నుండి పిలుపు వచ్చింది. ఈ కాల్పుల ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని శ్రీలంకలోని విదేశాంగ శాఖ ముందు కూడా కొలంబోలోని భారత హైకమిషన్ లేవనెత్తింది.