Breaking NewscrimeHome Page SliderNews AlertPoliticsTelangana

దిల్ ఇంట్లో ఐటి సోదాలు

ప్ర‌ముఖ నిర్మాత‌,ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు ఇంట్లో మంగ‌ళ‌వారం ఐటి అధికారులు సోదాలు జ‌రిపారు.సంక్రాంతికి వ‌స్తున్నాం,గేమ్ ఛేంజ‌ర్ సినిమాల‌కు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.అయితే గేమ్ ఛేంజ‌ర్‌కి తొలి రెండు రోజులు నెగ‌టివ్ టాక్ న‌డిచిన‌ప్ప‌టికీ అనంత‌రం సినిమా వ‌సూళ్లు పుంజుకున్నాయి. అదేవిధంగా ఇక సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాకి వ‌సూళ్ల పండ‌గ పెరిగింది.ప్ర‌స్తుతం పుష్ప 2 ,సంక్రాంతికి వ‌స్తున్నాం మిన‌హా ఈ రెండిటి కి పోటీ ఇచ్చే మూవీయే లేకుండా పోయింది. వాటి త‌ర్వాత గేమ్ ఛేంజ‌ర్ రేసులో ఉంది.దీంతో రెండు సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన దిల్ రాజు ఇంట ఐటి అధికారులు సోదాలు నిర్వ‌హించి ప‌లు కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు.దిల్ రాజుతో పాటు..పుష్ప-2 నిర్మాత, మైత్రి మూవీ మేకర్స్ అధినేత మైత్రీ న‌వీన్ ఇంటిపైనా అధికారులు దాడులు జరిపారు.మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేప‌ట్టారు.మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జ‌రిపారు.జూబిలీహిల్స్‌,బంజారాహిల్స్ ల‌లో వారి వారి ఇళ్లు కార్యాల‌యాల్లో దాడులు జ‌రుగుతున్నాయి.