Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews Alert

ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

ప‌ల్నాడు జిల్లాలో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది.దాచేపల్లి మండలం శ్రీనివాసపురం స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడింగ్ కోసం వెళుతుండగా గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. న‌డికుడి పొందుగుల స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.దీంతో గుంటూరు- హైదరాబాద్ మద్య నడవాల్సిన రైళ్ళ ను విజయవాడ మీదుగా దారి మళ్లించారు.రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. గ్యాంగ్ మెన్‌లు, ప్రొక్లెయిన‌ర్స్‌,జెసిబిల సాయంతో ఒరిగిన గూడ్స్ రైళ్ల‌ను త‌ప్పిస్తున్నారు.