భార్య టార్చర్‌తో మరో వ్యక్తి బలి
ఇటీవల కాలంలో భార్యలు టార్చర్ చేస్తున్నారంటూ పలువురు భర్తలు ఆరోపణలు చేస్తున్నారు. భార్య వేధిస్తోందంటూ మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్‌లో జరిగింది. గుజరాత్‌లోని జమరాలకు చెందిన సురేశ్ అనే వ్యక్తికి 17 ఏళ్ల క్రితం జయ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి 4గురు పిల్లలు కూడా ఉన్నారు. భార్య వేధింపులు భరించలేకపోతున్నానంటూ వీడియో రికార్డు చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు సురేశ్. తన సూసైడ్‌కు భార్య జయే కారణమని, ఆమెకు జీవితాంతం గుర్తుండే గుణపాఠం చెప్పాలని వీడియోలో కోరుకున్నాడు. అతని తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని భార్య జయపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

