Home Page SliderTelangana

గిఫ్ట్ పేరుతో డబ్బులను కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఓ యువకుడు సైబర్ నేరగాళ్లు వలలో ఇరుక్కున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో జరిగింది. భూక్య సంతోశ్ కు ఫేస్ బుక్ లో ‘మీకు గిఫ్ట్ పార్సిల్ వచ్చింది. ఇంగ్లాండ్ నుంచి 16000 పౌండ్స్ పంపుతున్నాం. కానీ ముందు మీరు కొంత డబ్బు చెల్లించాలి’ అంటూ మెసేజ్ వచ్చింది. దీనిని గుడ్డిగా నమ్మిన అతడు దశలవారీగా రూ. 2.75 లక్షలు పంపాడు. ఆ తర్వాత ఎంతకీ అవతలి నుంచి సమాధానం రాకపోవడంతో సంతోశ్ సైబర్ క్రైమ్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.