Andhra PradeshHome Page Slider

ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు సీరియస్

అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఇవాళ ఉదయం ప్రమాదం సంభవించింది. అక్కడున్న రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా పరిశ్రమలో హైడ్రోజన్ సల్ఫైడ్ విష వాయువులు లీకయ్యాయి. ఈ విష వాయువు పేల్చి నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు ఒడిశాకు చెందిన దేవ్ బాగ్, ఉగ్రేస్ గౌడ్ గుర్తించారు. వారిని చికిత్స కోసం గాజువాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
ఫార్మా కంపెనీలో ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్ అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.