ఫుట్‌పాత్‌పై దూసుకెళ్లిన ట్రక్..ముగ్గురి మృతి
పుణెలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ట్రక్ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా ఫుట్‌పాత్‌పై దూసుకొచ్చిన ఈ ట్రక్ అక్కడ నిద్రిస్తున్న కొందరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడు మద్యం తాగి ట్రక్ నడుపుతున్నాడా అనే కోణంలో విచారిస్తున్నారు.

