జగన్ బర్తడే వేడుకలపై ఆంక్షలు..
వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలపై కుప్పం పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పంలో వైఎస్ జగన్ పుట్టినరోజు (డిసెంబర్ 21) వేడుకల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతలు పోలీసులకు వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈ వేడుకలకు కుప్పం పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌కు ఈ లేఖను అందించారు. సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి డిసెంబర్ 19 నుండి 22 వరకూ కుప్పంలో పర్యటిస్తున్నారని, అందుకని ప్రతిపక్ష నేతలు సంబరాలు చేసుకోకూడదని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ కార్యక్రమాలు నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

