Breaking NewscrimeHome Page Slidermovies

సంధ్య థియేట‌ర్‌పై పోలీసుల వైల్డ్ ఫైర్‌

పుష్ప 2 రిలీజ్ సంద‌ర్భంగా హీరో అల్లు అర్జున్ సంధ్య థియేట‌ర్‌కి విచ్చేయ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే వివాహిత మృతిచెందింది.భ‌ర్త‌,ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా మూవీకి వ‌చ్చిన ఆమె…జ‌రిగిన తోపులాట‌లో ఊపిరాడ‌క మ‌ర‌ణించింది.విష‌యం తెలుసుకున్న అల్లు అర్జున్ మ‌రునాడు సెల్ఫీ వీడియో ద్వారా సానుభూతి తెలిపి రూ. 25ల‌క్ష‌ల ఆర్ధిక న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించారు.అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో సీరియ‌స్ గా ఉంది. మంత్రులు మాట్లాడుతూ…త‌మ వ‌ద్ద‌కు బెనిఫిట్ షోల కోసం రావ‌ద్ద‌ని ఈ ఘ‌ట‌న త‌ర్వాత సున్నితంగా విన్న‌వించారు.అనంత‌రం సంధ్య ధియేట‌ర్‌పై నాట‌కీయంగా కేసు న‌మోదు చేయించారు.య‌జ‌మాని,సెక్యూరిటీ మేనేజ‌ర్ స‌హా మొత్తం ముగ్గురిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు.స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోని కార‌ణంగా కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.