Home Page SliderNationalNews AlertTelangana

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భూప్రకంపనలు..

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి.  నేడు ఉదయం 7.25 గంటల ప్రాంతంలో రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. తెలంగాణలోని  హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్ ప్రాంతాలలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు.  ములుగు, హనుమకొండ, ఖమ్మం, భద్రాది గూడెం, మణుగూరు, గోదావరిఖని,భద్రాచలంలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసరగ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు వదిలి భయంతో పరుగులు తీసారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదయ్యింది. గత 20 ఏళ్లలో ఈ ప్రాంతాలలో ఇంత తీవ్రతతో భూకంపం ఏర్పడలేదని జియాలజిస్టులు చెప్తున్నారు.