ఫెంగల్ ఎఫెక్ట్.. కొట్టుకుపోతున్న వాహనాలు
తమిళనాడులోని ఫెంగల్ తుఫాన్ ఎన్నడూ లేనంత బీభత్సాన్ని సృష్టిస్తోంది. అక్కడ భారీ వర్షాలతో పుదుచ్చేరి, చెన్నై వణికిపోతున్నాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. భారీ వరదకు రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. రహదారులు చెరువులను గుర్తు చేస్తున్నాయి. విల్లుపురం, తిరువణ్ణామలై, ధర్మపురి, పుదుచ్చేరిలలో తుపాన్ ప్రభావం అధికంగా ఉంది. కృష్ణగిరిలో కొట్టుకుపోతున్న కార్లు, బస్సుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చురుగ్గా చేస్తున్నారు.