పవన్ కాకినాడ పర్యటనపై విమర్శలు
ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కాకినాడు ఓడరేవులో పర్యటించారు.ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం కంటెయినర్లను పరిశీలించారు. తాను ఇక్కడకు(కాకినాడకు) వస్తానంటే రెండు నెలల నుంచి రావద్దని మెసేజ్‌లు పెడుతున్నారన్నారు.కానీ ఆ మెసేజ్ లు పెట్టిందెవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.అదేవిధంగా ఇక్కడ నయా పైసా పెట్టుబడి పెట్టకుండా సబ్ సహారా ఆఫ్రికన్ కంట్రీస్ కి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇలా ఎవరు తరలిస్తున్నారనేది చెప్పలేదు.కాకినాడ పోర్టులో భద్రత పేలవంగా ఉందని చెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోని అన్నీ పోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఉన్నట్లు మొన్న ఆగస్టు 15నే ప్రకటించింది. తాను తలుచుకుంటే హోం శాఖ తీసుకోగలను అంటాడు.రాం గోపాల్ వర్మ విషయంలో విలేకరులు ప్రశ్నలు సంధిస్తే ఆ శాఖ తన పరిధిలో లేదంటాడు.కానీ పౌర సరఫరాలశాఖకు అంటూ ఓ మంత్రి ఉన్నాడని తెలిసినా…ఆయన శాఖలో మాత్రం వేలుపెడుతుంటాడు…అని ప్రతిపక్ష నాయకులు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

