‘నమో గ్రీన్ రైల్’..భారత్‌లో కొత్త ప్రయోగం..
భారతదేశంలో తొలిసారిగా గ్రీన్ రైలును ప్రవేశపెట్టబోతున్నారు. ఇది హైడ్రోజన్ ఆధారంగా నడుస్తుంది. దీనిని నమో గ్రీన్ రైల్ అంటున్నారు. ఇది ట్రయల్ రన్‌లో భాగంగా హర్యానా లోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఈ రైలులో 8 కోచ్‌లు ఉంటాయి. 2,638 మంది ప్రయాణికిలు ప్రయాణించవచ్చు. వీటి గరిష్టవేగం గంటకు 110 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని ఆర్‌డీఎస్‌ఓ డిజైన్ చేసింది. జర్మనీ మాత్రమే ప్రస్తుతం ఈ రైళ్లను నడుపుతోంది.
