వీటితో పెడిక్యూర్ చేయించుకుంటున్నారా?
పెద్ద పెద్ద మాల్స్‌లో చేప పిల్లలతో పెడిక్యూర్ చేసే సదుపాయం చూస్తుంటాం. అలా చేయించుకోవాలని ముచ్చట పడ్డారో ప్రమాదంలో పడ్డట్టే. ఫిష్ పెడిక్యూర్ ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ చేపలకు వేరే ఆహారం వేయరు. అందువల్ల పాదాలలో మృతకణాలతో పాటు, ఆరోగ్యకరమైన సున్నిత చర్మాన్ని కూడా కొద్దిగా తినడానికి ప్రయత్నిస్తాయి. వీటివల్ల సొరియాసిస్, ఎగ్జిమా, హెచ్ఐవీ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. చర్మంపై గాయాలు, ఇన్ఫెక్షన్లు అయ్యే ప్రమాదం ఉంది. నీరు శుభ్రంగా లేకపోయినా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే దీనిని అమెరికా, కెనడాలలో నిషేధించారు. యూరోప్‌లోని కొన్ని దేశాలలో కూడా ఈ ఫిష్ పెడిక్యూర్‌ను నిషేధించారు.

