Home Page SliderTelangana

ముఖ్యమంత్రిపై కేసు నమోదు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అసభ్య పదజాలంతో దూషించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు భయం కలిగించేలా ఉన్నాయని వారు కంప్లైంట్లు చేశారు. తమ నాయకులకు హాని కలిగితే దానికి ముఖ్యమంత్రి, ఇతర కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణ సమాజానికి అభ్యంతరకరంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలున్నాయని వారు పేర్కొన్నారు.