‘పాప్‌కార్న్ బ్రెయిన్’ అంటే ఏమిటో తెలుసా?
పాప్‌కార్న్ బ్రెయిన్ ప్రాబ్లమ్ ఇటీవల చాలామందిని వేధిస్తోంది. ఉదయం నుండి రాత్రి వరకూ నేటి తరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. వీటికి ప్రధాన కారణం సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవడమే. పాప్‌కార్న్‌లో ఎలా అయితే గింజలు పేలుతూ ఉంటాయో, అలాగే మెదడులో ఆలోచనలు అటూ, ఇటూ తిరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో తమ పోస్టులకు వ్యూస్ వచ్చాయా, లైక్స్ వచ్చాయా అంటూ దానినే ప్రపంచంగా భావించి ఆలోచించడంతో పాప్‌కార్న్ బ్రెయిన్ తయారవుతుంది. ఇలాంటి ఆలోచనల వల్ల ఆందోళన పెరిగిపోయి, ఏ పని మీదా శ్రద్ధ పెట్టలేరు. దీనివల్ల నిద్రలేమి, అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే దేనినైనా మితంగా వాడాలని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

