Andhra PradeshHome Page Slider

తిరుపతిలో ఉద్రిక్తత..టీటీడీ కార్యాలయం ముట్టడి..

తిరుపతి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, మఠాధిపతుల ఆందోళన చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై వారు ఆగ్రహంతో టీటీడీ కార్యాలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈవోను కలిసేందుకు దూసుకెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. తలుపులు తీయకుండా తాళాలు వేయడంతో వారు కార్యాలయం బయటే భైఠాయించారు. ఆలయాలలో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవోకు వినతి పత్రం ఇచ్చేవరకూ వెళ్లేది లేదన్నారు. గత పాలకమండలి ఛైర్మన్ల్, ఈవోలపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. చివరికి ఈవో వారితో చర్చలకు అంగీకరించగా కొందరిని లోనికి అనుమతించారు.