Andhra PradeshHome Page Slider

రూ.160 పల్లీ నూనె 90కే విక్రయం.. ఎగబడిన జనం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి పల్లీ నూనె లోడ్ ట్యాంకర్ ను దుండగులు చోరీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంకర్ ని చోరీ చేసి ఎన్టీఆర్ జిల్లా మైలవరం, పుల్లూరులో నూనె అమ్ముతూ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం, కండ్రిక, బంజర వరకు చేరు కున్నారు. మార్కెట్ లో లీటర్ రూ.160 వరకు ధర ఉన్న పల్లీ నూనెను రూ.90కే విక్రయిస్తుండడంతో జనాలు ఆయిల్ టిన్నులు, క్యాన్లతో బారులు దీరారు. ఈ విషయం పోలీసులకు చేరింది. దీంతో ఎస్ఐ పి.వెంకటేష్, సిబ్బంది చేరుకునేలోగా ట్యాంకర్ తో వచ్చిన వారు జారుకున్నారు. ఈ మేరకు విచారించిన ఎస్ఐ ఆయిల్ ట్యాంకర్ నందిగామకు చెందిన శ్రీ వేంకటేశ్వర ట్రేడర్స్ యజమాని శ్రీనివాస నాగప్రసాద్ కు చెందినదని గుర్తించారు. అయితే, అప్పటికే ట్యాంకర్లో సగం మేర నూనె అమ్మేయడం గమనార్హం.