గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్…
క్రీడలు, క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఐ టి , పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన లో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయని , క్రీడలను అన్ని రకాలుగా ప్రోత్సహించటంలో భాగంగా క్రీడా పాలసీ రూపొందించి, అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒలంపిక్స్ లో దక్షిణ కొరియా సాధించిన పథకాల గురించి ఆ దేశ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించే సామర్ధ్యం గల క్రీడాకారులను తయారు చేయుటకు త్వరలో ప్రారంభించి.. Sports Universityకి Sports Schools ను అనుసంధానం చేయ నున్నట్లు తెలిపారు.
క్రీడాకారులకి కింది స్థాయి నుంచే ప్రొఫెషనల్ శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన క్రీడా కారుల కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. క్రీడలకు ప్రభుత్వం రూ.364 కోట్లు కేటాయించినట్లు క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై న క్రీడలకు జవ సత్వాలు కల్పించుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ అధ్యక్షులు ఎన్. శివ సేనా రెడ్డి, వేణుగోపాల చారి, యూత్, స్పోర్ట్స్ & కల్చర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ VC & MD Soni Baladevi, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జగదీశ్వర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ క్రీడాకారులు, TGO, TNGO, 4 వ తరగతి ఉద్యోగ సంఘాల నాయకులను సన్మానించారు.

